పట్టణంలో అజయ్ అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు. అతడు పట్టణంలోని శివాజీ నగర్ లో ఉండే యూనియన్ బ్యాంకులో మేనేజర్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో కొద్దిమంది ఖాతాదారులకు 8 నెలల క్రితం టర్మ్ లోన్ తో పాటు క్రెడిట్ ఆన్ కరెంటు(సీసీ) రుణాలను కూడా మంజూరు చేశాడు. ఈ క్రమంలోనే 40 మంది అకౌంట్లలో మొదట టర్మ్ లోన్ కు సంబంధించిన డబ్బులను ఖాతాల్లో జమ చేశాడు. అదే సమయంలో మరో సీసీ రుణం అప్లయ్ చేసేందుకు వినియోదారుల నుంచి అవసమైన బ్యాంకు చెక్కులను, ప్రాపర్టీ డాక్యూమెంట్స్ ను తీసుకున్నాడు. ఆ తరువాత రెండో సీసీ లోన్ మంజూరు కాలేదని ఖాతాదారులను నమ్మించాడు. వారికి మంజురైన లోన్ డబ్బు రూ. 5 కోట్లను తన అకౌంట్లోకి బదిలీ చేసుకున్నాడు. ఈ లావాదేవీలు మొత్తం గతేడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరిగాయి. అయితే ఇటీవల బ్యాంకు ఉన్నాతాధికారులు తనిఖీలకు వచ్చారు.
ఈ క్రమంలోనే ఆ బ్యాంకులో రుణాల మంజూరులో, లావాదేవీల్లో అవకతవకలు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ తర్వాత వినియోదారులను పిలిచి విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భారీ మొత్తంలో రుణాల స్వాహా వ్యవహారం బయటపడింది. ఈ రుణాల పేరిట దాదాపు 40 మంది ఖాతాల్లో నుంచి రూ.5 కోట్లకు పైగా డబ్బును తన ఖాతాలో జమ చేసుకున్నట్లు గుర్తించారు. దీంతో బాధితులు లబోదిబోమంటూ మంగళవారం రాత్రి పోలీసులను కలిశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపిన పోలీసులు అజయ్‌పై కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నిందితుడు బ్యాంకు మేనేజర్ అజయ్ పరారీలో ఉన్నాడు. గతంలో కూడా
No comments:
Post a Comment