Thursday, July 18, 2024

Bhoopalapally 60 lakhs job scam

 RS.60 Lakhs Jobs Fraud in Jayashankar Bhupalpally :జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాల్లో ఉద్యోగాల పేరిట మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు. నిందితుల నుంచి నకిలీ చెక్కులు, ఒక కారును స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు. ఇప్పటి వరకు రూ.60 లక్షలకు పైగా మోసం చేసినట్లు గుర్తించారు. దీనికి సంబంధించి ఎస్పీ కిరణ్‌ ఖరే వివరాలు వెల్లడించారు.కొంత డబ్బే ఉద్యోగం మీకే అంటూ :జయశంకర్‌ భూపాలపల్లికి చెందిన గుర్రం శ్రీనివాస్‌ రావు, సన్నాయిల సుభాశ్, మోకిడి అశోక్‌, శ్రీకాంత్‌ కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పించే ఏజెన్సిని నిర్వహించేవారు. దీని ద్వారా ప్రభుత్వ కార్యాలయాల్లో, ఇతర ఆఫీసుల్లో చిన్నపాటి ఉద్యోగాలు ఇప్పించేవారు. అయితే అవసరం ఉన్నదాని కంటే ఎక్కువ మందిని ఉద్యోగంలో చేర్పించేవారు. అలా నిరుద్యోగులు, ఆశావహులకు కొంత డబ్బులు ఇస్తే చాలు పక్కాగా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తామని, తర్వాత అది పర్మినెంట్‌ అవుతుందంటూ ఆశ చూపించేవారు. ఆ మాటలు నమ్మి పలువురు యువతీ యువకులు వారికి రూ.లక్షల్లో మూట చెప్పారు.ఇలా ఒక్కొక్కరి నుంచి రూ.లక్ష, రూ.2 లక్షలు వసూలు చేసేవారు. ఇప్పటివరకు దాదారు 50 మంది వద్ద సుమారు రూ.60 లక్షలు వసూలు చేశారు. ఇలా డబ్బులు తీసుకున్న వారికి డ్యూటీలు వేసేవాడు. నెలంతా ఏదో ఓ పని చేయించి, జీతం విషయం వచ్చేసరికి తప్పించుకుని తిరిగేవారు. దీంతో అనుమానం వచ్చిన బాధితులు శ్రీనివాస్‌ అనే వ్యక్తిని నిలదీయగా, అసలు నిజం బయటపడింది

No comments:

Post a Comment